Degree @ Two and Half Years | రెండున్నరేండ్లకే డిగ్రీలు
Degree @ Two and Half Years | రెండున్నరేండ్లకే డిగ్రీలు
వచ్చే ఏడాది నుంచే అమల్లోకి
ఉన్నత విద్యా విధానంలో కీలక నిర్ణయం తీసుకున్న యూజీసీ
Hyderabad : దేశ వ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జాతీయ విద్యా విధానం కావొచ్చు, ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న విద్యా విధానం కావొచ్చు భారత దేశంలో యూనివర్సిటీల ద్వారా ప్రదానం చేసే డిగ్రీలలో కూడా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా ఉన్నత విద్యా విధానంలో నూతన విధానం ప్రవేశ పెడుతుంది. కొనసాగింపుగా ఇప్పటి వరకు నాలుగేండ్ల హానర్స్, మూడేండ్ల డిగ్రీ వంటి విధానం ఉంది. దానికి తోడుగా యూనివర్సిటీ డిగ్రీలు ఇక నుంచి రెండున్నర సంవత్సరాలకే డిగ్రీలు ప్రధానం చేసే విధానం ప్రవేశ పెడుతూ యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు. అయితే ఈ విధానం యువతకు చాలా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అయితే విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత కేవలం రెండున్నర ఏండ్లలోనే డిగ్రీ పూర్తి చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు. అయితే మెరిట్ విద్యార్థులకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే డిగ్రీ కోర్సుల వ్యవధి తగ్గించే అంశంపై యూజీసీకి చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను యూజీసీ ఆమోదించడంతో ఈ ప్రకటన వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజులలో విడుదల చేయనున్నట్లు యూజీసీ పేర్కొన్నది.
* * *
Leave A Comment